Monday 4 May 2015

How to sow a plant.....???????

ముందుగా మొక్కని సెలెక్ట్ చేసుకోవాలి 

అంటు సరిగ్గా ఉందా లేదా అని గమనించాలి ...
అంటు కట్టిన ప్రాంతం లో కొత్త చిగురు రాకూడదు 
అంటు కట్టిన బాగం కింద కొత్త చిగురు రాకూడదు 
అంటు పూర్తగా అతుక్కుని ఉండాలి ...



మొక్కని జాగ్రతగా పట్టుకోవాలి


మొక్కను సంచి లో నుండి తీసినపుడు మట్టి ముద్ద పగిలి పోకుండా ,,,వేరు బయటికి రాకుండా  జాగ్రతగా తీయాలి.
మొక్క నాటడానికి ముందు మాత్రమే సంచిని విడదీయాలి .
మొక్క నాటడానికి మూడు రోజుల ముందు నుండి మొక్కకు నీరు పోయకూడదు ...అలా నీరు పోయడం వలన మట్టి మెత్తగా అయి సంచి నుండి విడదీయగానే మట్టి ముద్ద పగిలి పోతుంది .


మొక్కను నాటడానికి ఒక గొయ్యి తీయాలి .
సంచి ఉన్న కొలతలకు సరిగ్గా మూడింతలు కొలతలతో ఒక గొయ్యి తవ్వాలి .
ఉదా : సంచి కొలత 1 X 1 X 1 అయితే గొయ్యి 3 X 3 X 3 తీయాలి.
తిరిగి గోయ్యిని మట్టితో నింపాలి  ( గొయ్యి తీసినపుడు వచ్చిన మట్టి )
ఇలా చేయడం వలన గోయ్యిలోని మట్టి వదులుగా ఉంటుంది ...
దీనివలన మొక్క వేరు సులబంగా వ్యాప్తి చెంది మొక్క త్వరగా పెరగడానికి ఉపయోగపడుతుంది ........

తరువాత మట్టిని పూర్తిగా కప్పాలి .
మట్టి పూర్తిగా నింపిన తరువాత కాలితో తొక్క కూడదు ...
గమనిక : అంటు కట్టిన బాగం బూమి లోపలి వెళ్ళకూడదు ...అల వెళ్తే తల్లి మొక్క పెరిగి అంటు మొక్క చనిపోతుంది.


 తరువాత వెంటనే మొక్కకు 30 లీటర్ల నీటిని పట్టాలి .
దీని వలన లోపలి మట్టి బాగం లో ఏదైనా గాలి బుడగలు ఉంటె అవి పోయి మట్టి పూర్తిగా మొక్కను పట్టుకుంటుంది,






గొయ్యి లో చీమల మందు ( గమాక్సిన్ ) లేదా చెదల మందు వేస్తే వేరు తినే చేధలనుంది మొక్కను రక్షించ వచ్చును,


మీ సందేహాలకు 
దీపక్ 
+91 9985997959

No comments:

Post a Comment