Thursday 30 April 2015

Infosys లో పని చేయడం కంటే పాలమ్ముకోవడం మంచిదా?




Infosys లో పని చేయడం కంటే పాలమ్ముకోవడం మంచిదా?software vs milkvendorకృష్ణారావ్‌ (K.Rao) B.Tech పాస్‌ అయి Campus placements లో Infosys లో ఉద్యోగం తెచ్చుకున్నాడు.సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజ్‌. చుట్టాలు, చుట్టు పక్కల జనం చప్పట్లు కొట్టి K.Rao కి అభినందనలు తెలిపారు. K.Rao మొహం వెలిగిపోయింది,ఇక ముందు అన్నీ మంచి రోజులే అని సంబర పడిపోయాడు.పక్క వీధి లో మల్లేశ్‌ డిగ్రీ fail అయ్యాడు, అందరూ విమర్శించారు, హైద్రాబాద్‌ లో అంతా ఇంజనీరింగ్‌,IITల్లో చదివి హైటెక్‌ సిటీ లో జాబ్‌ చేస్తుంటే , cheap గా డిగ్రీ చదవడం ,పైగా fail అవ్వడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు.ఇంట్లో వాళ్ళు తిట్టి పోసారు, మల్లేశ్‌ నాన్న కొడదామనుకున్నాడు, మల్లేశ్‌ అందరి తిట్లు వినలేక చెవులు ముసుకున్నప్పుడుఅతని కండలు చూసితిట్టడమే బెటరని తిట్టి వురుకున్నాడు. వీడు బండి మీద ఇడ్లీ,దోసా అమ్ముకోవాలన్నారు, పాన షాప్‌ పెట్టుకోమన్నారు, పాలు అమ్ముకోవడానికి తప్ప దేనికీ పనికి రాడని ముద్ర వేశారు. “పాలు” “పాలు”మల్లేశ్‌ వాళ్ళ అమ్మ అక్కడే ఆగి పోయింది, ఏదో ఒకటి కొడుకు పని చేసుకోవాలి, పెళ్ళి చేసుకొని బ్రతకాలి అని రెండు లక్షలు కొడుక్కిచ్చిందిపాల వ్యాపారం చేసుకోమని. మల్లేశ్‌ మరో రెండు లక్షలుఅప్పు చేసి అర డజన్‌ బర్రెలు కొని పాల వ్యాపారం మొదలు పెట్టాడు.K.Rao credit card మీద బైక్‌ కొని “రైయ్‌, రైయ్‌” మని Infosys కి వెళ్తుంటే , స్కుటర్‌ మీద పాల క్యాన్లు వేసుకొని మల్లేశ్‌ బయల్దేరాడు. K.Rao చెయ్యి లేపిstyle గా “హాయ్‌” చెప్పాడు, కొంచెం గర్వంగా నవ్వాడు, మల్లేశ్‌ మాత్రం నవ్వలేక నవ్వుతూ చెయ్యి లేపి ముందుకెళ్ళి పోయాడు.ఆరు నెలలు గడిచి పోయాయి. K.Rao bike మీద 20% వడ్డీ కట్టగా అసలు 80 వేలు అలాగే వుంది. మల్లేశ్‌ తన రెండు లక్షల అప్పులో ఓ లక్ష తీర్చేసాడు. Office కి వెళ్తుంటే మల్లేశ్‌ఎదురొచ్చాడు, అసలు ఎప్పుడు అయిపోతుందా అని దిగులు మొహంతో K.Rao నవ్వాడు, సగం అప్పు తీరి పోయింది అని సగం దిగులు తో మల్లేశ్‌ నవ్వాడు. ఇద్దరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. సంవత్సరం గడిచింది salary పెరుగుతుందని ఆశగా చూస్తున్న K.Rao మీద Recession పిడుగు పడింది. Salary hike వుండదని కంపెనీ వాళ్ళు mail చేసారు. ఆ mail ఇంగ్లీశ్‌ లో వున్నా రాంగోపాల్‌ వర్మ తెలుగులో తీసిన “మర్రిచెట్టు” లా భయంకరంగా కనిపించింది. పది రూపాయిలున్న half litre 14/- రూపాయిలు అయ్యింది, మల్లేశ్‌ కి 30% రాబడి పెరిగింది, ఇంకో లక్ష అప్పూ తీర్చేసాడు.K.Rao ఎలగొలా కష్ట పడి bike అప్పు తీర్చి Personal Loan (16% వడ్డీ) రెండు లక్షలు తీసుకొని ఇంట్లోకి furniture, Laptop ,LCD TV కొన్నాడు. అందరూ వాళ్ళ నాన్న 25 ఏళ్ళు ఉద్యోగం చేసి చెయ్యలేనిది రెండు సంవత్సరాలు గడవక ముందే చేసాడని తెగ పొగిడి పైకి లేపారు. మల్లేశ్‌ తన దగ్గర మిగిల్చిన ఓ లక్ష పెట్టి మరో అర దజనుబర్రెలు కొన్నాడు.పాల దిగుబడి రెండింతలయ్యింది. Office కి వెళ్తూ మళ్ళీ ఇద్దరూ ఎదురయ్యారు, K.Rao ఈ Personal loan ని తలచుకుంటు ఎప్పుడు తీరుతుందా అని సందేహంగా నవ్వాడు, మల్లేశ్‌ అప్పుల్లేవు అని చింత లేకుండా నవ్వాడు.మరో రెండు సంవత్సరాలు తరువాత K.Rao కి 10% salary hike వొచ్చింది. కాస్త కుదుట పడి కార్‌ లోన్‌ తీసుకొని Maruti Wagan R కారు కొన్నాడు. మల్లేశ్‌ ఊరి బయట రెండెకరాల స్థలం కొని బర్రెల్ని అక్కడికి మార్చాడు. పెద్ద స్థలంలో ఇప్పుడతని దగ్గర ఓ రెండుడజన్‌ బర్రెలున్నాయి. పాల ధర మరో 30% పెరిగింది, అంటే K.Rao కన్నా రాబడి సుమారు 200% పెరిగింది. K.Rao కి బోడి 10% మాత్రమే పెరిగింది. మల్లేశ్‌ ఊరి బయట నుంచిసిటీలోకి పాలు తేవడానికి ఓ ఆటో కొన్నాడు, కార్లో K.Rao, ఆటో లో మల్లేశ్‌ ఎదురు పడ్డారు, కార్లో కూర్చున్నా అప్పులు, వడ్డీలు, ముష్టి లాంటి హైకులు గుర్తోచ్చి K.Rao మనస్పూర్తిగానవ్వలేక పోయాడు, చూడు ఇది నా సొంత ఆటో అని మల్లేశ్‌ హాయి గా నవ్వాడు.మరో రెండు సంవత్సరాలు గడిచే సరికి K.Rao 40 లక్షలు Home Loan తో ఓ అపార్ట్‌ మెంట్‌ కొన్నాడు. మల్లేశ్‌, బాగా రేటు రావడంతో సగం స్థలం అమ్మేసి రెండు అపార్ట్‌ మెంట్లు అప్పు లేకుండా కొన్నాడు. అతని దగ్గర ఇప్పుడు బర్రెలు సంఖ్య సెంచరీ దాటింది. K.Rao కి మరో 10% హైక్‌ వచ్చింది. పాల ధర లీటర్‌ 40 దాటింది, మరో 30% లీటరు మీద ఆదాయం, పాల దిగుబడి ముందుకన్నా పదింతలు పెరిగింది, సుమారు 500% లాభాలు పెరిగాయి. ఆ దెబ్బతో ఒక స్కోడా, మరో ఇన్నోవా కొన్నాడు. K.Rao మారుతి కార్లో, మల్లేశ్‌ స్కోడా లో తను అప్పు చేసి కొన్న అపార్ట్‌ మెంట్‌ ముందు ఎదురుపడ్డారు. K.Rao ఉద్యోగం పోతే 40 లక్షలు అప్పు ఎలా కట్టాలి అనే Tension తో నవ్వాడు, మల్లేశ్‌ చిన్న సైజ్‌ పాల ఫ్యాక్టరీ లో 50 మంది పని చేస్తున్నారు అని confidence, ఆత్మ విశ్వాసం తో నవ్వాడు.K.Rao ఆ రోజు రాత్రి ఆలోచించాడు, ఐదేళ్ళ తరువాత చూస్తే మల్లేశ్‌ దగ్గర నాలుగైదు కోట్లు విలువ చేసే ఆస్తులు, నెలకి ఐదారు లక్షల ఆదాయం, 50 మందికి ఉద్యోగ అవకాశం, తనకి సంవత్సరానికి 6 లక్షల salary, 40 లక్షల అప్పు, ఉంటుందా ఊడుతుందా తెలియని ఉద్యోగం , ఇదీ ఇద్దరి Balance sheet.తనకి ఉద్యోగం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళందర్నీ పిలిచి చెంపలు పగలకొట్టాలనుకున్నాడు.Facts: పాలు 2008 లో 10/- లీటర్‌, ఇప్పుడు 40/-, బంగారం 12500/- 10grams, ఇప్పుడు 30000/- , Software లో పని చేసే వారి జీతాలు ఈ నాలుగేళ్ళలో 30% పెరిగితే, అన్ని రేట్లు 300% పెరిగాయి, అయినా బయట అందరూ Software లో చేసే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నట్లు ఏడుస్తున్నారు,

No comments:

Post a Comment